Share News

నీరజ్‌కు ఒలింపిక్‌ బెర్త్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:09 AM

ఐఎస్ఎస్ఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత రైఫిల్‌ షూటర్‌ నీరజ్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించాడు. ఈ క్రమంలో దేశానికి రెండో ఒలింపిక్‌ బెర్త్‌ను అందించాడు. బుధవారం జరిగిన...

నీరజ్‌కు ఒలింపిక్‌ బెర్త్‌

50 మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో కాంస్యాలు

దోహా: ఐఎస్ఎస్ఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత రైఫిల్‌ షూటర్‌ నీరజ్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించాడు. ఈ క్రమంలో దేశానికి రెండో ఒలింపిక్‌ బెర్త్‌ను అందించాడు. బుధవారం జరిగిన పురుషుల 50 మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో నీరజ్‌ 346.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. తటస్థ అథ్లెట్‌ దిమిత్రి పిమెనోవ్‌ 362.8 పాయింట్లతో స్వర్ణం, స్లొవేకియా షూటర్‌ ప్యాట్రిక్‌ జనీ 357.2 పాయింట్లతో రజతం దక్కించుకొన్నారు. మరో భారత షూటర్‌ ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ 323.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. కాగా, నీరజ్‌, ఐశ్వరీ, అఖిల్‌ షెరాన్‌లతో కూడిన త్రయం టీమ్‌ విభాగంలో 1751 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకొంది. పురుషుల ట్రాప్‌ షూటర్లు ఉదయ్‌వీర్‌, వివాన్‌ కపూర్‌లు తొలి రోజు ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచి ఫైనల్‌ అవకాశాలను మెరుగుపర్చుకొన్నారు. పురుషుల 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌లో జైపాల్‌ మాల్వియా రజతంతో ఒలింపిక్‌ బెర్త్‌ను అందించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!

కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?

Updated Date - Nov 12 , 2026 | 06:09 AM