Share News

ముకేష్‌,తనిష్క్‌కు పతకాలు

ABN , Publish Date - Feb 09 , 2026 | 05:46 AM

ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో గుంటూరు షూటర్‌ నేలవల్లి ముకేష్‌, హైదరాబాద్‌ షూటర్‌ తనిష్క్‌ మురళీధర్‌ నాయుడు రెండు పతకాలు...

ముకేష్‌,తనిష్క్‌కు పతకాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో గుంటూరు షూటర్‌ నేలవల్లి ముకేష్‌, హైదరాబాద్‌ షూటర్‌ తనిష్క్‌ మురళీధర్‌ నాయుడు రెండు పతకాలు కొల్లగొట్టారు. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన జూనియర్‌ 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో ముకేష్‌ 559 పాయింట్లతో రజతం దక్కించుకోగా, తనిష్క్‌ 557 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగం టీమ్‌ ఈవెంట్‌లో ముకేష్‌, తనిష్క్‌, సూరజ్‌ త్రయం 1692 పాయింట్లతో స్వర్ణం సాధించింది. సీనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ఇలవెనిల్‌ వలరివన్‌-అర్జున్‌ జోడీ స్వర్ణంతో మెరిసింది. జూనియర్‌ 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో హిమాన్షు-శాంభవి ద్వయం స్వర్ణం కొల్లగొట్టింది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

Updated Date - Feb 09 , 2026 | 05:46 AM