ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు: మిథాలీ రాజ్
ABN , Publish Date - Aug 15 , 2026 | 06:08 PM
ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ ప్రతిభకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మంచి వేదికగా నిలుస్తోందని భారత మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు లీగ్ ద్వారా తమ సత్తాను నిరూపించుకునే అవకాశం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ ప్రతిభకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మంచి వేదికగా నిలుస్తోందని భారత మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు లీగ్ ద్వారా తమ సత్తాను నిరూపించుకునే అవకాశం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రారంభించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ యువ, ఔత్సాహిక క్రికెటర్లకు అత్యున్నత స్థాయి అవకాశాలు అందించి వారి ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తోందని అన్నారు (Mithali Raj Andhra Premier League).
రాష్ట్ర స్థాయిలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, వాళ్లకు సరైన గుర్తింపు కావాలని మిథాలీ అన్నారు. జిల్లాల్లో ఉండి క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఉన్న పిల్లలకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా మంచి అవకాశం లభిస్తోందన్నారు. మహిళా క్రికెట్‌కు ఏసీఏ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళా ప్రీమియర్ లీగ్ ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతోందని ప్రశంసించారు (APL 2026 Andhra cricket).
స్థానిక ప్రతిభను గుర్తించి, వారికి సరైన వేదిక కల్పించడం ద్వారా భవిష్యత్తులో మరింత మంది ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉందని మిథాలీ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే స్నేహ దీప్తి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు (ACA Mithali Raj APL). ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కేవలం పోటీలు నిర్వహించే వేదికగా కాకుండా, యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వ్యవస్థగా అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..