Share News

వెన్నునొప్పితో తప్పుకొన్న మీరాబాయి

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:11 AM

ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి స్టార్‌ ప్లేయర్‌ మీరాబాయి చాను తప్పుకొంది. ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని...

వెన్నునొప్పితో తప్పుకొన్న మీరాబాయి

వరల్డ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌

నింగ్‌బో (చైనా): ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి స్టార్‌ ప్లేయర్‌ మీరాబాయి చాను తప్పుకొంది. ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఆమె 53 కిలోల విభాగానికి మారింది. అయితే, గురువారం ఉదయం వామప్‌ చేస్తుండగా వెన్నునొప్పి తలెత్తడంతో మీరా పోటీల నుంచి తప్పుకోక తప్పలేదు. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల 49 కిలోల విభాగంలో చాను రజతం సాధించింది. కాగా, మరో భారత లిఫ్టర్‌ జ్ఞానేశ్వరి దేవి (53 కి.) మొత్తం 198 (88+110) కిలోలుఎత్తి ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి:

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు

Updated Date - Oct 30 , 2026 | 05:11 AM