Share News

పసిడి పోరుకు మనీష

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:22 AM

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత క్రీడాకారిణి మనీషా భన్వాలా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మెగా టోర్నీలో భారత పసిడి ఆశలను...

పసిడి పోరుకు మనీష

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆస్టానా (కజకిస్థాన్‌): వరల్డ్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత క్రీడాకారిణి మనీషా భన్వాలా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మెగా టోర్నీలో భారత పసిడి ఆశలను సజీవంగా నిలబెట్టింది. గురువారం జరిగిన 59 కిలోల సెమీ్‌సలో మనీష 10-0తో ఆల్టిన్‌ షగయేవ (కజకిస్థాన్‌)పై గెలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్‌ బౌట్‌లో అబిగెయిల్‌ ఎలిజబెత్‌ నెట్టె (అమెరికా)తో మనీష అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, ఈ టోర్నీలో నీలమ్‌, కాజల్‌ తర్వాత స్వర్ణ పోరుకు చేరుకొన్న మూడో రెజ్లర్‌ భన్వాల. నీలమ్‌, కాజల్‌లు తుది పోరులో ఓడి రజతాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. కాగా, పురుషుల 65 కిలోల కేటగిరీలో ఆసియాడ్‌ చాంపియన్‌ సుజీత్‌ కల్కల్‌ క్వార్టర్స్‌లోనే పరాజయం పాలయ్యాడు.

ఇవి కూడా చదవండి:

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు

Updated Date - Oct 30 , 2026 | 05:22 AM