లవ్లీనా, సాక్షి, జాదుమణిలకు కామన్వెల్త్, ఆసియాడ్ బెర్త్‌లు
ABN , Publish Date - May 16 , 2026 | 02:49 AM
ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్, జెయింట్ కిల్లర్ సాక్షీ చౌదురి, పురుష బాక్సర్లు జాదుమణి...
పటియాల: ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్, జెయింట్ కిల్లర్ సాక్షీ చౌదురి, పురుష బాక్సర్లు జాదుమణి సింగ్, నరేందర్ బెర్వాల్.. ప్రతిష్టాత్మక కామన్వెల్త్, ఆసియా క్రీడల బెర్త్‌లు దక్కించుకున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ తుది రౌండ్లలో సాక్షి (51 కిలోలు) 5-0తో మీనాక్షి హుడాను ఓడించింది. అంతకుముందు రౌండ్‌లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌ను సాక్షి ఓడించిన సంగతి తెలిసిందే. లవ్లీనా (71 కిలోలు) 5-0తో సనమాచ చానుపై, జాదుమణి (55 కిలోలు) 5-0తో నిఖిల్‌పై, నరేందర్ (90+ కిలోలు) 5-0తో సావన్‌పై గెలిచి బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. వీరితో పాటు పర్వీన్ హుడా (65 కి), సుమిత్ కుందు (70 కి), అంకుశ్ (80 కి), కపిల్ పొఖారియా (90 కి) కూడా ఫైనల్స్‌లో ప్రత్యర్థులను ఓడించి రెండు టోర్నీలకు అర్హత సాధించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు
Read Latest Telangana News And AP News And International News