Share News

ఏఐటీఏ ఎన్నికల బరిలో పేస్‌

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:56 AM

అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది...

ఏఐటీఏ ఎన్నికల బరిలో పేస్‌

న్యూఢిల్లీ: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌..తాత్కాలిక అధ్యక్షుడు చింతన్‌ పారిఖ్‌ జై కొట్టా డు. ‘టెన్నిస్‌ ఫస్ట్‌’ అనే బ్యానర్‌ కింద చింతన్‌ వర్గంతో కలిసి సంయుక్తంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. ఆ బ్యానర్‌ తరపున ఉపాధ్యక్ష పదవికి రేస్‌లో నిలవనున్నాడు. వాస్తవంగా ఈనెల 27న జరిగే ఏఐటీఏ ఎన్నికల్లో చింతన్‌ పారిఖ్‌కు వ్యతిరేకంగా అఽధ్యక్ష పదవికి పోటీ చేయాలని పేస్‌ నిర్ణయించుకున్నాడు. అయితే పేస్‌ ప్రస్తుతం మనసు మార్చుకొని గుజరాత్‌కు చెందిన చింతన్‌కు మద్దతు ఇవ్వడం గమనార్హం.

ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ

ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..

5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్

Updated Date - Nov 02 , 2026 | 02:56 AM