తన్వీ, అన్మోల్ ముందంజ
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:10 AM
భారత యువ షట్లర్లు తన్వీ శర్మ, అన్మోల్ ఖర్బ్ కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు...
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్లు తన్వీ శర్మ, అన్మోల్ ఖర్బ్ కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. వెటరన్ స్టార్ హెచ్‌ఎస్ ప్రణయ్ మాత్రం అనూహ్యంగా తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు. దక్షిణ కొరియాలోని యోసులో బుధవారం జరిగిన సింగిల్స్ మొదటి రౌండ్లో తన్వీ21-16, 12-21, 21-17తో మనామి సుయిజు (జపాన్)పై, అన్మోల్ 21-19, 21-18తో రేచల్ చాన్ (కెనడా)పై గెలిచారు. ప్రణయ్ 15-21, 21-23తో యో తే బిన్ (దక్షిణ కొరియా) చేతిలో కంగుతిన్నాడు.
ఇవి కూడా చదవండి:
WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ
అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!