20 ఏళ్లకే ప్రపంచ చాంపియన్
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:57 AM
ఫార్ములా-1 ప్రపంచ చాంపియన్గా నిలిచిన పిన్నవయస్కుడిగా ఇటలీకి చెందిన కిమీ ఆంటోనెల్లి (20 ఏళ్ల 68 రోజులు) చరిత్ర సృష్టించాడు...
చిన్నోడు
ఫార్ములావన్లో కిమీ కొత్త చరిత్ర
మెక్సికో సిటీ: ఫార్ములా-1 ప్రపంచ చాంపియన్గా నిలిచిన పిన్నవయస్కుడిగా ఇటలీకి చెందిన కిమీ ఆంటోనెల్లి (20 ఏళ్ల 68 రోజులు) చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన మెక్సికన్ గ్రాండ్ప్రీలో మెర్సిడెస్ డ్రైవర్ ఆంటోనెల్లి మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఎవరికీ అందనంత రీతిలో 119 పాయింట్లు ఆధిక్యాన్ని సాధించిన ఆంటోనెల్లి.. ఈ ఏడాది వరల్డ్ చాంపియన్ టైటిల్ను తనపేరిట రాసుకొన్నాడు. 2010లో రెడ్బుల్స్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (23 ఏళ్ల 134 రోజులు) పిన్నవయసులో వరల్డ్ చాంపియన్గా నిలిచిన రికార్డును కిమీ అధిగమించాడు. అంతేకాకుండా 73 ఏళ్ల తర్వాత ఈ ఘనతను అందుకొన్న ఇటలీ డ్రైవర్గా నిలిచాడు. 1952, 1953లో అలర్టో ఆస్కారి వరుసగా టైటిళ్లను సొంతం చేసుకొన్నాడు.
ఈ వార్తలూ చదవండి
సింగరేణి గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్లో పలు రైళ్ల రద్దు
మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్డీఎంఏ