Share News

క్వార్టర్‌ఫైనల్లో శ్రీకాంత్‌, లక్ష్య

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:20 AM

భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టారు...

క్వార్టర్‌ఫైనల్లో శ్రీకాంత్‌, లక్ష్య

జపాన్‌ ఓపెన్‌

కుమమొటొ (జపాన్‌): భారత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌లో ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ శ్రీకాంత్‌ 21-15, 11-21, 21-18తో ఐదో సీడ్‌, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ కొడాయ్‌ నరోకా (జపాన్‌)కు షాకిచ్చాడు. క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌కే చెందిన కొకి వతనాబేతో శ్రీకాంత్‌ అమీతుమీ తేల్చుకుంటాడు. మరో ప్రీక్వార్టర్‌ఫైనల్‌ పోరులో ఎనిమిదో సీడ్‌ లక్ష్యసేన్‌ 21-8, 21-14తో డాంగ్‌ తియాన్‌ యవో (చైనా)ని చిత్తు చేశాడు. తదుపరి రౌండ్‌లో యుషి తనాకా (జపాన్‌)ను సేన్‌ ఢీకొంటాడు. మహిళల డబుల్స్‌ రౌండ్‌-16లో గాయత్రి/తనీషా ద్వయం 14-21, 14-21తో మూడో సీడ్‌ రిన్‌ ఇవంగ/కీ నకనిషీ (జపాన్‌) జోడీ చేతిలో పరాజయంపాలై టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 02:21 AM