Share News

కబడ్డీ విస్తరణకు ముందడుగు

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:41 AM

కబడ్డీని విశ్వవ్యాపితం చేసేందుకు అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (ఐకేఎఫ్‌) సభ్యదేశాల సంఖ్యను రెట్టింపు చేశామని ఆ క్రీడా సమాఖ్య డైరెక్టర్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ వెల్లడించారు.

కబడ్డీ విస్తరణకు ముందడుగు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కబడ్డీని విశ్వవ్యాపితం చేసేందుకు అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ (ఐకేఎఫ్‌) సభ్యదేశాల సంఖ్యను రెట్టింపు చేశామని ఆ క్రీడా సమాఖ్య డైరెక్టర్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఐకేఎఫ్‌ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆఫిక్రాఖండం నుంచి 20 దేశాల ప్రతినిధులు, ఐరోపా నుంచి 16 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాసాని మాట్లాడుతూ సభ్యత్వాల సంఖ్యను 60 నుంచి 80కి పెంచడంతో పాటు కబడ్డీ విస్తరణ, అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

ఈ వార్తలను కూడా చదవండి

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా
నిండుకుండలా లుబ్బుర్తి జలాశయం

Updated Date - Sep 05 , 2026 | 01:41 AM