అమ్మాయిల జైత్రయాత్ర
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:29 AM
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంప్ భారత మహిళల జట్టు వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది..
4-0తో జపాన్‌పై గెలుపు
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
భోపాల్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంప్ భారత మహిళల జట్టు వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4-0తో జపాన్‌ను చిత్తు చేసింది. లాల్‌రిమ్సియామి (12వ నిమిషం), దీపిక (16వ, 48వ), నేహ (28వ) గోల్స్ చేశారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ మొత్తం 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, జపాన్‌పై గెలవడంతో భారత అమ్మాయిల జట్టు ఎఫ్‌ఐహెచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా నాలుగో ర్యాంక్‌కు ఎగబాకింది. మంగళవారం చైనాపై గెలుపుతో చరిత్రలో తొలిసారి భారత జట్టు టాప్-5లోకి దూసుకెళ్లింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్