Share News

అంబేకర్‌, గుంజన్‌ స్వర్ణ చరిత్ర

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:33 AM

యూత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించిన భారత బాక్సర్లుగా లైరెన్‌లక్‌పమ్‌ అంబేకర్‌ మీటీ, గుంజన్‌ చరిత్ర సృష్టించారు...

అంబేకర్‌, గుంజన్‌ స్వర్ణ చరిత్ర

యూత్‌ ఒలింపిక్స్‌

డకార్‌ (సెనెగల్‌): యూత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించిన భారత బాక్సర్లుగా లైరెన్‌లక్‌పమ్‌ అంబేకర్‌ మీటీ, గుంజన్‌ చరిత్ర సృష్టించారు. గురువారం హోరాహోరీగా జరిగిన పురుషుల 50 కిలోల ఫైనల్లో అంబేకర్‌ 3-2తో క్రిస్టియన్‌ జుబాని (ఐర్లాండ్‌)ని ఓడించి దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించాడు. 2010లో శివ థాపా రజతం తర్వాత యూత్‌ ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అలాగే మహిళల 48 కిలోల ఫైనల్లో గుంజన్‌ 5-0తో బౌతైనా బెన్సెలా (అల్జీరియా)ని చిత్తు చేసింది. ఈ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత మహిళా బాక్సర్‌గా 17 ఏళ్ల గుంజన్‌ రికార్డులకెక్కింది.

ఈ వార్తలు కూడా చదవండి..

మానసిక ఒత్తిడితోనే కుటుంబం ఆత్మహత్య

అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ

Updated Date - Nov 13 , 2026 | 02:33 AM