హర్మన్ ప్రీత్, దీప్తి సెంచరీలు.. జింబాబ్వే ఎదుట 329 పరుగుల భారీ టార్గెట్..
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:57 PM
జింబాబ్వే మహిళలతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోరు సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అద్భుత శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వే మహిళలతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోరు సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అద్భుత శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. వడోదరలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు (India Women vs Zimbabwe Women).
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే వికెట్లు పడినప్పటికీ హర్మన్‌ప్రీత్ (121 బంతుల్లో 126) ఒత్తిడికి లోను కాకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ శతకం సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు ఉన్నాయి. ఈ శతకం ఆమె వన్డే కెరీర్‌లో ఎనిమిదోది. దీంతో భారత మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డే శతకాలు సాధించిన బ్యాటర్లలో మిథాలీ రాజ్‌ను అధిగమించింది. ఈ జాబితాలో స్మృతి మంధాన 14 శతకాలతో ముందుండగా, హర్మన్‌ప్రీత్ రెండో స్థానంలో నిలిచింది (Harmanpreet Kaur century).
మరోవైపు దీప్తి శర్మ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది (Deepti Sharma century). ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు సాధించింది. 86 బంతుల్లో 106 పరుగులు సాధించింది. ఆమె స్ట్రైక్ రేట్ 123కు పైగా ఉండటం విశేషం. ఇద్దరూ శతకాలు సాధించడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. అలాగే ఓపెనర్ ప్రతీకా రావల్ (61) అర్ధశతకం సాధించింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో సిబాండ రెండు వికెట్లు సాధించింది.
ఇవి కూడా చదవండి..
ముంబైలో తీవ్ర వాయు కాలుష్యం.. దుమ్ము, వాహనాల పొగ, నిర్మాణ పనులే ప్రధాన కారణాలు..
మామ ఇంట్లో బంగారం కాజేసి థార్ కొన్నాడు.. పూజకు ఆ మామనే ఆహ్వానిస్తే..