శాంభవి జోడీకి రికార్డు పసిడి
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:45 AM
ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత ద్వయం శాంభవీ క్షీరసాగర్, దివ్యాన్షు దేవాంగన్ అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డ్...
జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్
కైరో: ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత ద్వయం శాంభవీ క్షీరసాగర్, దివ్యాన్షు దేవాంగన్ అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డ్ స్కోరుతో స్వర్ణ పతకం కొల్లగొట్టారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో శాంభవి, దివ్యాన్షు 499.9 పాయింట్లతో టైటిల్ సొంతం చేసుకున్నారు. సాయ్ చీ, చెన్ యు (చైనీస్ తైపీ) 498.3 పాయింట్లతో రజతం, ఫ్రాన్స్‌కు చెందిన టిఫెన్ పోమెస్, గస్పార్డ్ లీజియెర్ (434.4) కాంస్య పతకాలు నెగ్గారు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కిది నాలుగో పసిడి పతకం. మరో ఐదు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News