చిన్న జట్టు..పెద్ద ఘనత!
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:35 AM
ఈసారి యూత్ ఒలింపిక్స్‌లో 17 మందితో కూడిన అతి చిన్న జట్టుతో భారత్ బరిలోకి దిగింది. కానీ పతకాల పరంగా చూస్తే పెద్ద ఘనత సాధించింది.
యూత్ ఒలింపిక్స్‌లో భారత్ అద్భుత ప్రదర్శన
న్యూఢిల్లీ: ఈసారి యూత్ ఒలింపిక్స్‌లో 17 మందితో కూడిన అతి చిన్న జట్టుతో భారత్ బరిలోకి దిగింది. కానీ పతకాల పరంగా చూస్తే పెద్ద ఘనత సాధించింది. రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలు సహా మొత్తం పది పతకాలు సొంతం చేసుకుంది. ఈ రెండు స్వర్ణాలు కూడా బాక్సర్లు అంబేకర్, గుంజన్ సాధించారు. సెనెగల్ రాజధాని డకార్‌లో గురువారం ముగిసిన యూత్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ప్రతిభ క్రీడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
పతకాలు నెగ్గిన వారిలో ఖేలో ఇండియా అథ్లెట్లు తన్వీ పత్రి (బ్యాడ్మింటన్), ఖుష్భూ రజక్‌భాయ్ (జూడో), శౌర్య అంబురే (అథ్లెటిక్స్), గుంజన్ (బాక్సింగ్), తీర్థంక్ పెగు (స్విమ్మింగ్) ఉండడం విశేషం. డకార్‌లో పది పతకాలు..యూత్ ఒలింపిక్స్‌లో భారత్ రెండో అత్యుత్తమ ప్రదర్శన. 2018లో 13 పతకాలు నెగ్గడం యూత్ ఒలింపిక్స్‌లో ఇప్పటిదాకా మన అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఆ క్రీడల్లో 46 మంది అథ్లెట్లతో భారత్ తలపడింది.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!