క్రికెట్‌లో భారత్ సెమీస్ ప్రత్యర్థి శ్రీలంక
ABN , Publish Date - Sep 30 , 2026 | 02:33 AM
ఆసియాడ్ పురుషుల క్రికెట్‌లో వరుణుడి హవా సాగుతోంది. వర్షం కారణంగా మంగళవారం జరగాల్సిన రెండు క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌లు కూడా రద్దయ్యాయి.
క్వార్టర్స్ మ్యాచ్‌లన్నీ వర్షార్పణం
ఆసియాడ్ పురుషుల క్రికెట్‌లో వరుణుడి హవా సాగుతోంది. వర్షం కారణంగా మంగళవారం జరగాల్సిన రెండు క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌లు కూడా రద్దయ్యాయి. నేపాల్‌తో శ్రీలంక, మలేసియాతో బంగ్లాదేశ్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డు తగిలాడు.
అంతకుముందు రోజు భారత్-అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్-హాంకాంగ్ క్వార్టర్స్ మ్యాచ్‌లు కూడా వర్షార్పణమైన సంగతి తెలిసిందే. కనీసం టాస్ కూడా వేయడానికి వీలు పడకపోవడంతో మ్యాచ్‌లను రద్దు చేశారు. అయితే, మెరుగైన ర్యాంకింగ్స్ కారణంగా శ్రీలంక, బంగ్లా జట్లు సెమీ్‌సకు అర్హత సాధించాయి. గురువారం జరిగే సెమీఫైనల్లో లంకతో భారత్ తలడపనుంది. మరో సెమీ్‌సలో పాక్‌తో బంగ్లా అమీతుమీ తేల్చుకోనుంది.
ఇవి కూడా చదవండి:
ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్