రాణించిన కివీస్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతో తెలుసా..
ABN , Publish Date - Jan 23 , 2026 | 08:54 PM
రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు సమష్టిగా రాణించి భారీ స్కోరు సాధించారు. బ్యాటింగ్‌కు అనుకూలించే రాయ్‌పూర్ పిచ్‌పై టీమిండియా బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు సమష్టిగా రాణించి భారీ స్కోరు సాధించారు. బ్యాటింగ్‌కు అనుకూలించే రాయ్‌పూర్ పిచ్‌పై టీమిండియా బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిచెల్ శాంట్నర్ (47 నాటౌట్), రచిన్ రవీంద్ర (44) కీలక పరుగులు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు (IND vs NZ 2nd T20).
అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి వికెట్‌కు కాన్వే (19), టిమ్ సీఫెర్ట్ (24) 43 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (44) కీలక ఇన్నింగ్స్ ఆడి భారీ స్కోరుకు బాటలు వేశాడు. చివర్లో మిచెట్ శాంట్నర్ (47 నాటౌట్) వేగంగా ఆడి కివీస్ స్కోరును 200 దాటించాడు. చివరకు న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది (India vs New Zealand live score).
టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు (Team India chase target). హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 209 పరుగులు చేయాలి. రాయ్‌పూర్‌లో రాత్రి సమయంలో పొగమంచు విపరీతంగా కురిసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ భారీ స్కోరును టీమిండియా బ్యాటర్లు ఎలా ఛేదిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం.. ఇజ్రాయెల్‌లో హై అలర్ట్..
ట్రంప్ తీరు వల్ల అమెరికా ఇతర దేశాల విశ్వాసం కోల్పోతోంది.. జేపీ మోర్గాన్ విమర్శలు..