Share News

టాస్ గెలిచిన భారత్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - Jan 23 , 2026 | 06:59 PM

తొలి టీ20ను కైవసం చేసుకుని జోరు మీదున్న టీమిండియా మరికాసేపట్లో రాయ్‌పూర్‌లో మొదలు కాబోతున్న రెండో మ్యాచ్‌లో కూడా గెలుపొందాలని కృతనిశ్చయంతో ఉంది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే రాయ్‌పూర్ పిచ్ మీద టాస్ కీలకం

టాస్ గెలిచిన భారత్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
India vs New Zealand toss

తొలి టీ20ను కైవసం చేసుకుని జోరు మీదున్న టీమిండియా మరికాసేపట్లో రాయ్‌పూర్‌లో మొదలు కాబోతున్న రెండో మ్యాచ్‌లో కూడా గెలుపొందాలని కృతనిశ్చయంతో ఉంది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించే రాయ్‌పూర్ పిచ్ మీద టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది (India vs New Zealand toss).


రాయ్‌పూర్‌లో రెండో బ్యాటింగ్ సమయంలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది (India New Zealand live). ఆ సమయంలో బౌలింగ్ చేయడం కష్టం. దీంతో టీమిండియా కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయం కారణంగా అక్షర్ తప్పుకున్నాడు. బుమ్రాకు విశ్రాంతి లభించింది. వీరి స్థానంలో జట్టులోకి హర్షిత్, కుల్దీప్ వచ్చారు.


తుది జట్లు:

భారత్: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

న్యూజిలాండ్: కాన్వే, టిమ్ సీఫర్ట్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, చాప్‌మన్, డారెల్ మిచెల్, శాంట్నర్, ఫౌక్స్, హెన్రీ, సోధి, డఫీ


ఇవి కూడా చదవండి..

ఇరాన్ వైపు అమెరికా నౌకాదళం.. ఇజ్రాయెల్‌లో హై అలర్ట్‌..


ట్రంప్ తీరు వల్ల అమెరికా ఇతర దేశాల విశ్వాసం కోల్పోతోంది.. జేపీ మోర్గాన్ విమర్శలు..

Updated Date - Jan 23 , 2026 | 07:10 PM