గ్రూప్ టాపర్‌గా భారత్
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:19 AM
కామన్వెల్త్ కబడ్డీ పోటీల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత పురుషుల జట్టు గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచింది....
కామన్వెల్త్ కబడ్డీ
అహ్మదాబాద్: కామన్వెల్త్ కబడ్డీ పోటీల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత పురుషుల జట్టు గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచింది. గురువారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 45-24తో శ్రీలంకను చిత్తు చేసింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ మొత్తం 12 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. లంక 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కాగా, శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్, కెన్యాతో శ్రీలంక అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు