పసిడికి ఒక్క అడుగు
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:08 AM
డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషులు ఆసియా క్రీడల హాకీలో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకొనేందుకు ఒక్క మ్యాచ్ దూరంలో నిలిచారు....
పురుషుల హాకీ ఫైనల్లో భారత్
సెమీ్‌సలో పాకిస్థాన్‌పై గెలుపు
నగోయ: డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషులు ఆసియా క్రీడల హాకీలో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకొనేందుకు ఒక్క మ్యాచ్ దూరంలో నిలిచారు. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో మనోళ్లు 4-3తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించారు. 3-3తో స్కోరు సమంగా ఉండగా, మ్యాచ్ ముగిసేందుకు మరో 45 సెకన్ల సమయమే ఉన్న తరుణంలో ఫార్వర్డ్ అభిషేక్ గోల్ కొట్టి భారత్‌కు విజయం అందించాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను (5, 13ని.) గోల్స్‌గా మలిచాడు. సుఖ్‌జీత్ సింగ్ (23ని.) ఫీల్డ్ గోల్ చేయగా..మ్యాచ్ చివరి క్షణాల్లో అభిషేక్ మరో ఫీల్డ్ గోల్ సాధించాడు. శనివారం జరిగే పసిడి పతక పోరులో మలేసియాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీఫైనల్లో మలేసియా 2-1తో దక్షిణ కొరియాపై నెగ్గింది.
సెపక్‌తక్రాలో కాంస్యం ఖాయం..: సెపక్‌తక్రా పురుషుల క్వాడ్రాంట్‌లో భారత్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తద్వారా కనీసం కాంస్య పతకం మనకు లభించనుంది.
రెజ్లింగ్‌లో చేజారిన కాంస్యం: రెజ్లింగ్ మహిళల 67 కి. విభాగంలో మాన్సీ అహ్లావత్ కాంస్య పతక బౌట్‌లో మాన్సీ 2-5తో అల్ట్‌జిన్ (మంగోలియా) చేతిలో ఓడిపోయింది.
జూడోలోనూ..: భారత జూడోకా ఇనంగంబి మహిళల 70కి. విభాగంలో కాంస్య పతక పోరులో అనుజిన్ (మంగోలియా) చేతిలో ఓడిపోయింది. 1986 తర్వాత తొలిసారి ఆసియా క్రీడల్లో టెన్నిస్ పతకం లేకుండా భారత్ వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సుమిత్ నగాల్ 4-6, 4-6తో యిబింగ్ (చైనా) చేతిలో ఓడడంతో ఆసియాడ్ టెన్ని్‌సలో మన కథ ముగిసింది. సైక్లింగ్‌తోపాటు, పిస్టల్ షూటర్ అనీష్ భన్వాల కూడా నిరాశ పరిచారు. పురుషుల వాలీబాల్ క్వార్టర్‌ఫైనల్లో భారత్ 0-3తో పాకిస్థాన్ చేతిలో ఓడింది.
ఈ వార్తలు కూడా చదవండి
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు
రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..