Share News

IND VS NZ: టాస్ గెలిచిన భారత్..

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:42 PM

విశాఖ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

IND VS NZ: టాస్ గెలిచిన భారత్..
India Opts To Bowl

స్పోర్ట్స్ డెస్క్: ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ(బుధవారం) విశాఖ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య నాలుగో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక విశాఖ వేదికపై భారత్ కు మంచి రికార్డే ఉంది. విశాఖపట్నంలో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడింది. మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడింది. అయితే విశాఖలో కివీస్, భారత్ టీ20ల్లో తలపడటం ఇదే తొలిసారి.


ఇక విశాఖ పిచ్‌ విషయానికి వస్తే.. ఇది ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలమే. ఇవాళ(బుధవారం) జరిగే మ్యాచుకు భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యే అవకాశముందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో మంచు కురిసే అవకాశం ఉండటంతో భారీ లక్ష్యాలు కూడా ఇక్కడ సురక్షితం కాదు. చివరగా 2023లో ఇక్కడ జరిగిన టీ20లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఛేదించింది. ఇక్కడి వికెట్‌ నుంచి స్పిన్నర్లకు సహకారం అందుతుంది. మంచు ప్రభావం దృష్ట్యా టాస్‌ గెలిచిన భారత బౌలింగ్‌ను ఎంచుకుంది.


తుది జట్లు:

భారత్:

అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్:

టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), జాక్ ఫౌక్స్, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ.


ఇవి కూడా చదవండి:

టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు

జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్‌

Updated Date - Jan 28 , 2026 | 07:32 PM