Share News

పురుషుల శుభారంభం

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:41 AM

ప్రతిష్ఠాత్మక థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌లో తొలి రోజు భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. థామస్‌ కప్‌ గ్రూప్‌-ఎలో పురుషులు 4-1తో కెనడాను చిత్తు చేశారు....

పురుషుల శుభారంభం

మహిళల పరాజయం

థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌

హోర్సెన్స్‌ (డెన్మార్క్‌): ప్రతిష్ఠాత్మక థామస్‌, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌లో తొలి రోజు భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. థామస్‌ కప్‌ గ్రూప్‌-ఎలో పురుషులు 4-1తో కెనడాను చిత్తు చేశారు. ఉబెర్‌ కప్‌ గ్రూప్‌-ఎలో మహిళలు 2-3తో ఆతిథ్య డెన్మార్క్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆయుష్‌ అదుర్స్‌: కెనడాతో పోరు మొదటి సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ఓడినా..ఆయుష్‌ షెట్టి, సాత్విక్‌/చిరాగ్‌ ద్వయం విజయాలతో జట్టును ఆదుకున్నారు. వరల్డ్‌ నెం.13 విక్టర్‌ లాయ్‌తో జరిగిన సింగిల్స్‌లో 18-21, 21-19, 21-10తో లక్ష్య ఓడాడు. తదుపరి జరిగిన డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ జోడీ 21-10, 21-11తో జొనాథన్‌ బింగ్‌/కెవిన్‌ లీ జంటను చిత్తు చేశారు. తర్వాత జరిగిన రెండో సింగిల్స్‌లో ఆయుష్‌ షెట్టి 21-13, 21-17తో వరల్డ్‌ నెం.33 బ్రియాన్‌ యంగ్‌పై నెగ్గడంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. రెండో డబుల్స్‌లో హరిహరన్‌/అర్జున్‌ 21-7, 21-15తో టై అలెగ్జాండర్‌/ యుకారాను ఓడించడంతో భారత్‌ 3-1తో పోరును సొంతం చేసుకుంది. చివరగా జరిగిన ప్రాధాన్యంలేని సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21-17, 21-12తో ఎన్‌గ్యుయెన్‌పై నెగ్గడంతో మనోళ్ల ఆధిక్యం 4-1కి చేరింది. ఇదే గ్రూపులో..డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనా 5-0తో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. దాంతో చైనా అగ్ర స్థానంలో నిలవగా, భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది.


సింధు గెలిచినా..

డెన్మార్క్‌తో ఉబెర్‌ కప్‌లో..హోరాహోరీగా సాగిన తొలి సింగిల్స్‌లో పీవీ సింధు 21-13, 18-21, 21-17 క్రిస్టోఫర్‌సెన్‌ను ఓడించింది. రెండో సింగిల్స్‌లో ఉన్నతి హుడా 21-21, 23-25తో కెజెర్స్‌ఫెల్ట్‌ చేతిలో పోరాడి ఓడింది. దాంతో 1-1తో డెన్మార్క్‌ సమవుజ్జీగా నిలిచింది. మూడో సింగిల్స్‌లో షుల్జ్‌ 19-21, 21-16, 21-16తో తన్వీ శర్మపై గెలవడంతో భారత్‌ 1-2తో వెనుకంజలో నిలిచింది. దీంతో కీలకమైన డబుల్స్‌ మ్యాచ్‌లో ప్రియ/శ్రుతి ద్వయం 11-21, 21-11, 21-23తో అమాలీ/మెటె చేతిలో ఓడడంతో డెన్మార్క్‌ 3-1తో పోరును సొంతం చేసుకుంది. నామమాత్రమైన ఆఖరి..డబుల్స్‌లో ప్రత్యర్థి జంట అలెగ్జాండ్రా/క్రిస్టిన్‌ రిటైర్‌ కావడంతో సింధు/తనీషా జోడీని విజయం వరించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 04:41 AM