Share News

అభిరత్‌ సెంచరీ మిస్‌

ABN , Publish Date - Oct 28 , 2026 | 02:01 AM

ఓపెనర్‌ అభిరత్‌ రెడ్డి (97) మూడు పరుగుల్లో శతకం చేజార్చుకోగా, రాహుల్‌ రాధేశ్‌ (72 బ్యాటింగ్‌) అర్ధ శతకంతో సత్తా చాటడంతో పంజాబ్‌తో గ్రూప్‌ ‘బి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ప్రత్యర్థికి దీటుగా బదులిస్తోంది.

అభిరత్‌ సెంచరీ మిస్‌
Hyderabad vs Punjab

  • హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ 193/2

  • పంజాబ్‌తో రంజీ

హైదరాబాద్‌: ఓపెనర్‌ అభిరత్‌ రెడ్డి (97) మూడు పరుగుల్లో శతకం చేజార్చుకోగా, రాహుల్‌ రాధేశ్‌ (72 బ్యాటింగ్‌) అర్ధ శతకంతో సత్తా చాటడంతో పంజాబ్‌తో గ్రూప్‌ ‘బి’ రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ప్రత్యర్థికి దీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 193/2 స్కోరుతో నిలిచింది.


అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 289/6తో మంగళవారం మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పంజాబ్‌ 431 రన్స్‌కు ఆలౌటైంది. సలీల్‌ అరోరా (151) శతకంతో చెలరేగాడు. మిలింద్‌ 4, రక్షణ్‌ 3 వికెట్లు తీశారు. ఇక.. విజయవాడలో ఆంధ్రతో మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండోరోజు ఆట ముగిసే సరికి 216/8 స్కోరు చేసింది. ఆంధ్ర మొదటి ఇన్నింగ్స్‌లో 231 రన్స్‌కు ఆలౌటైంది.


ఇవి కూడా చదవండి:

ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..

Updated Date - Oct 28 , 2026 | 02:01 AM