హైదరాబాద్ గెలుపు
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:13 AM
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో హైదరాబాద్ రెండో విజయం అందుకుంది....
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో హైదరాబాద్ రెండో విజయం అందుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో 4 వికెట్లతో ఉత్తరాఖండ్‌ను ఓడించింది. మొదట ఉత్తరాఖండ్ 19.2 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. యువరాజ్ (59), అన్వీష్ (43) మాత్రమే రాణించారు. కెప్టెన్ మిలింద్ (4/25) నాలుగు, రక్షణ్ (3/24) మూడు, అజయ్ (2/24) రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో హైదరాబాద్ 15.3 ఓవర్లలో 149/6 స్కోరు చేసి నెగ్గింది. హిమతేజ (77) హాఫ్ సెంచరీతో మెరిశాడు.
ఇవి కూడా చదవండి..
భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..
రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..