Share News

హర్మన్‌ప్రీత్‌కే సారథ్యం

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:17 AM

గోల్‌ కీపర్‌ కృష్ణ బహదూర్‌ పాఠక్‌ మళ్లీ భారత హాకీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్‌లో ఈ నెల 27 నుంచి నవంబరు 5 వరకు జరిగే..

హర్మన్‌ప్రీత్‌కే సారథ్యం

ఏసీటీ కోసం భారత హాకీ జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: గోల్‌ కీపర్‌ కృష్ణ బహదూర్‌ పాఠక్‌ మళ్లీ భారత హాకీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్‌లో ఈ నెల 27 నుంచి నవంబరు 5 వరకు జరిగే ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ (ఏసీటీ) కోసం హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో భారత జట్టును హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం ప్రకటించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జట్టునే దాదాపుగా ఈ టోర్నీకి ఎంపిక చేశారు. అయితే, సీనియర్‌ హాకీ ప్లేయర్‌ మన్‌దీ్‌ప సింగ్‌, జర్మన్‌ప్రీత్‌ సింగ్‌, అమిత్‌ రోహిదాస్‌, నీలకంఠ శర్మ ఈ టోర్నీతో జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతారని సమాచారం. కాగా భారత్‌తోపాటు మలేసియా, జపాన్‌, కొరియా, చైనా, బంగ్లాదేశ్‌ జట్లు బరిలో ఉన్నాయి. డిఫెండింగ్‌ చాంప్‌గా దిగనున్న భారత్‌.. ఐదుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచింది. జలంధర్‌లో లీగ్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. సెమీస్‌, ఫైనల్‌కు మొహాలీలోని బల్బీర్‌ సింగ్‌ స్టేడియం వేదిక కానుంది.

ఇవి కూడా చదవండి:

బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!

ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

Updated Date - Oct 14 , 2026 | 06:17 AM