పసిడి పోరుకు గుంజన్, అంబేకర్
ABN , Publish Date - Nov 12 , 2026 | 06:11 AM
యూత్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు గుంజన్, లైరెన్‌లక్‌పమ్ అంబేకర్ మీటీ ఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాలు...
యూత్ ఒలింపిక్స్
డకార్ (సెనెగల్): యూత్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు గుంజన్, లైరెన్‌లక్‌పమ్ అంబేకర్ మీటీ ఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాలు ఖరారు చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల 50 కిలోల విభాగం సెమీఫైనల్లో అంబేకర్ 5-0తో కొలంబియా బాక్సర్ గలేయ అరెవలోను చిత్తు చేశాడు. ఈ క్రమంలో 2010లో శివ థాపా తర్వాత యూత్ ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారత బాక్సర్‌గా అంబేకర్ నిలిచాడు. ఇక, మహిళల 48 కిలోల విభాగం సెమీఫైనల్లో గుంజన్ 4-1తో లిల్లీ బస్సెట్ (బ్రిటన్)పై విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!
కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?