గాయత్రి జోడీ శుభారంభం
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:11 AM
సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యా డ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ శుభారంభం చేసింది...
సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్
లఖ్‌నవూ: సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 బ్యా డ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ శుభారంభం చేసింది. బుధవారం ప్రారంభమైన ఈ పోటీల డబుల్స్‌లో గాయత్రి జోడీ 21-8, 21-7తో రష్మీ గణేష్-అమృత ప్రముథేష్ ద్వయంపై గెలిచింది. డబుల్స్‌లో ఆంధ్ర ద్వయం భార్గవ్ రామ్-విశ్వ తేజ 16-21, 21-12, 21-15తో ఆర్య-ధ్రువ్ జంటపై, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆంధ్ర షట్లర్ సాత్విక్ రెడ్డి-రిషిక జోడీ 24-22, 14-21, 21-15తో వోంగ్ టైన్-లిమ్ సైన్ (మలేసియా) జంటని ఓడించింది. సింగిల్స్‌లో తెలుగు షట్లర్లు శ్రీయాన్షి 14-21, 11-21తో అన్మోల్ చేతిలో, తరుణ్ మన్నేపల్లి 21-23, 11-21తో హువాంగ్ (ఇంగ్లండ్) చేతిలో పోరాడి ఓడారు. ఇతర సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఉన్నతి హుడా, అశ్మిత, తన్వీ శర్మ, ఇషారాణి, తస్నీం మీర్, అన్మోల్ ఖర్బ్ రెండో రౌండ్‌లో ప్రవేశించగా, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, కిరణ్ జార్జ్, డబుల్స్‌లో రుతపర్ణ-శ్వేతపర్ణ జంట, మిక్స్‌డ్‌లో శివాని గద్దె-రోహన్ కపూర్ ద్వయం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్