Share News

సౌదీ, బహ్రెయిన్ ఫార్ములా-1 ఈవెంట్స్ రద్దు

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:19 PM

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ, బహ్రెయిన్ ఫార్ములా-1 ఈవెంట్స్ రద్దయ్యాయి. ప్రత్యామ్నాయ వేదికల్లో ఈవెంట్స్ నిర్వహించాలని మొదట అనుకున్నా చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు అధికారులు తెలిపారు.

సౌదీ, బహ్రెయిన్ ఫార్ములా-1 ఈవెంట్స్ రద్దు
Bahrain, Saudi F1 Grand Prix cancelled

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఫార్ములా-1 కార్ల రేసులకూ ఆటంకాలు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్‌లో జరగాల్సిన సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఫార్ములా-1 కార్ల రేసులు రద్దు అయ్యాయి. దీంతో, జపనీస్ గ్రాండ్ ప్రీ రేసు తరువాత ఫార్ములా-1 షెడ్యూల్‌లో దాదాపు ఐదు వారాల పాటు ఎలాంటి రేసులు ఉండవని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మునుపటి షెడ్యూల్ ప్రకారం, బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ రేసు ఏప్రిల్ 12న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వేదికగా జరగాల్సి ఉంది. వారం తరువాత సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీని ప్లాన్ చేశారు. ఈ రెండిటి రద్దుతో ఈ ఏడాది షెడ్యూల్‌లో ఐదు వారాల పాటు విరామం వచ్చినట్టైంది. తదుపరి మే నెలలో మియామీ గ్రాండ్ ప్రీ జరగాల్సి ఉంది.


బహ్రెయిన్, సౌదీ ఈవెంట్స్‌కు ప్రత్యామ్నాయ వేదికల గురించి ఆలోచించినా చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు ఫార్ములా-1 నిర్వాహకులు తెలిపారు. ఫార్ములా-1తో పాటు ఎఫ్2, ఎఫ్3, ఎఫ్ అకాడమీ రౌండ్స్‌ కూడా రద్దయ్యాయని తెలిపారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. తాము భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ అధిపతి మొహమ్మద్ బిన్ సూలేమ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

ఆ ఇద్దరు టాప్ ఆర్డర్‌లో ఆడటం కష్టం.. ముంబై జట్టుపై హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 15 , 2026 | 06:45 PM