ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఆ టికెట్.. రూ.21 కోట్లు
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:38 AM
క్రీడారంగంలో ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌క్‌పకున్న క్రేజే వేరు. ఇక ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఏడాది జూలై 19న...
న్యూజెర్సీ: క్రీడారంగంలో ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌క్‌పకున్న క్రేజే వేరు. ఇక ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఏడాది జూలై 19న న్యూజెర్సీలో జరిగే ఫైనల్ పోరు టిక్కెట్ రేట్లు మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో ఉన్నాయి. రీసేల్ మార్కెట్‌లో వీటి ధరలు రూ.కోట్లు దాటుతున్నాయి. ముఖ్యంగా గోల్ పోస్ట్ వెనుక భాగంలోని లోయర్ డెక్‌లో నాలుగు ప్రత్యేక సీట్ల ధర ఒక్కోటి రూ.21 కోట్ల 68 లక్షలుగా ఉండడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అలాగే బ్లాక్ 146లోని కొన్ని సీట్లకు రూ.1.73 కోట్లు వెచ్చించాల్సిందే. రీసేల్ మార్కెట్ ధరలు ఫిఫా నియంత్రణలో ఉండవు. కానీ ప్రతీ టిక్కెట్‌పై కొనుగోలుదారుడి నుంచి 15 శాతం, అమ్మకందారు నుంచి 15 శాతం రీసేల్ ఫీజు మాత్రం వసూలు చేస్తుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News