చెలరేగిన డకెట్, బేకర్
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:56 AM
తొలుత ఓపెనర్ బెన్ డకెట్ (115 బంతుల్లో 133) సెంచరీతో కదం తొక్కగా.. అనంతరం యువ పేసర్ సోనీ బేకర్ (4/45) చెలరేగిన వేళ...
ఆస్ట్రేలియా ఓటమి
ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్
హోబర్ట్: తొలుత ఓపెనర్ బెన్ డకెట్ (115 బంతుల్లో 133) సెంచరీతో కదం తొక్కగా.. అనంతరం యువ పేసర్ సోనీ బేకర్ (4/45) చెలరేగిన వేళ ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో ఇంగ్లండ్ 97 పరుగులతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 48.3 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. విల్‌జాక్స్ (59), బాంటమ్ (44) సత్తా చాటారు. జాక్ ఎడ్వర్డ్స్ 4, రెన్‌షా 3 వికెట్లు పడగొట్టారు. భారీ ఛేదనలో ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 231 రన్స్‌కే చేతులెత్తేసింది. రెన్‌షా (55), అలెక్స్ కేరీ (37), జాక్ ఎడ్వర్డ్స్ (31) మాత్రమే రాణించారు. డాసన్ మూడు వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి:
20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?
రూ. 3,700 కోట్ల డీల్.. కేకేఆర్‌లో తన సగం వాటా విక్రయించిన జూహీ చావ్లా భర్త!