Share News

డేవిస్‌ కప్‌లో భారత్‌కు నిరాశ

ABN , Publish Date - Sep 20 , 2026 | 05:28 AM

డేవిస్‌కప్‌లో భారత జట్టు పోరాటం క్వాలిఫయర్‌ రెండో రౌండ్‌లోనే ముగిసింది. దక్షిణ కొరియా 3-1 ఆధిక్యంతో...

డేవిస్‌ కప్‌లో భారత్‌కు నిరాశ

1-3తో కొరియా చేతిలో ఓటమి

సియోల్‌: డేవిస్‌కప్‌లో భారత జట్టు పోరాటం క్వాలిఫయర్‌ రెండో రౌండ్‌లోనే ముగిసింది. దక్షిణ కొరియా 3-1 ఆధిక్యంతో భారత్‌పై గెలిచి డేవిస్‌ కప్‌ ఫైనల్‌ 8లో చోటు దక్కించుకుంది. కొరియాతో పోరులో భాగంగా శుక్రవారం రెండు సింగిల్స్‌లో భారత్‌ ఓడిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజైన శనివారం జరిగిన డబుల్స్‌లో భారత జోడీ దక్షిణేశ్వర్‌/శ్రీరామ్‌ బాలాజీ 6-3, 3-6, 6-3తో నామ్‌ జి సంగ్‌/పార్క్‌ ఉయి సంగ్‌ జంటపై గెలిచి ఆశలు రేపింది. కానీ కీలక రివర్స్‌ సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌ 1-6, 2-6తో సూన్‌వూ క్వోన్‌ చేతిలో ఓడడంతో 3-1తో కొరియా స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లింది.

ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు

మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 05:29 AM