మిలింద్‌కు హైదరాబాద్ పగ్గాలు
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:42 AM
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బరిలోకి దిగే హైదరాబాద్ జట్టును హెచ్‌సీఏ ప్రకటించింది. ఈనెల 14వ తేదీ నుంచి...
ముస్తాక్ అలీ టోర్నీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బరిలోకి దిగే హైదరాబాద్ జట్టును హెచ్‌సీఏ ప్రకటించింది. ఈనెల 14వ తేదీ నుంచి ఈ టోర్నీ జరగనుంది. హైదరాబాద్ సారథిగా సీవీ మిలింద్, వైస్ కెప్టెన్‌గా అభిరథ్ రెడ్డి నియమితులయ్యారు. వీరితో పాటు తన్మయ్, అమన్, హిమతేజ, రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), సాయి ప్రజ్ఞయ్ (వికెట్ కీపర్), భవేష్, గణేష్, తనయ్ త్యాగరాజన్, ప్రణవ్, వేద్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, అజయ్, నిషాంత్, రాహుల్ బుద్ధి, హర్షిత్‌కు జట్టులో చోటు లభించింది. స్టాండ్ బైలుగా వైష్ణవ్, సాయి వికాస్, దినేష్, ఆశీష్, అనికేత్ రెడ్డి ఎంపికయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లాండ్ ఫార్మా లాభం రూ.291 కోట్లు
For More Business News And Telugu News