గుజరాత్ బ్యాటర్ల హవా.. చెన్నై ముందు భారీ లక్ష్యం..
ABN , Publish Date - May 21 , 2026 | 09:33 PM
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు అదరగొట్టారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ అర్ధశతకాలు సాధించారు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 229 పరుగులు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు అదరగొట్టారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ అర్ధశతకాలు సాధించారు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 229 పరుగులు చేసింది. చెన్నై ముందు భారీ లక్ష్యం ఉంచింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఈ భారీ టార్గెట్‌ను ఎలా ఛేదిస్తుందో చూడాలి (GT vs CSK live match).
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై గుజరాత్ ఓపెనర్లు చెలరేగారు. సాయి సుదర్శన్ (84), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (64) సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 125 పరుగులు జోడించారు. 13వ ఓవర్లో జాన్సన్ బౌలింగ్‌లో గిల్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జాస్ బట్లర్ (27 బంతుల్లో 57 నాటౌట్) వేగంగా పరుగులు చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన సాయి సుదర్శన్‌ను అన్షుల్ కాంబోజ్ అవుట్ చేశాడు (IPL latest score).
చివరకు చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అన్షుల్, జాన్సన్‌కు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. మరి, ఈ కీలకమైన మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..