Share News

రోహిత్, కోహ్లీకి 'నో' చెప్పకూడదు: బీసీసీఐకి రికీ పాంటింగ్ సూచన..

ABN , Publish Date - May 21 , 2026 | 09:10 PM

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి రాబోయే వన్డే ప్రపంచకప్‌లో చోటు ఉండదనే చర్చ జరుగుతున్న వేళ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ స్పందించాడు. రోహిత్, కోహ్లీ ఛాంపియన్ ఆటగాళ్లని, వారిని తక్కువగా అంచనా వేయకూడదని పేర్కొన్నాడు.

రోహిత్, కోహ్లీకి 'నో' చెప్పకూడదు: బీసీసీఐకి రికీ పాంటింగ్ సూచన..
Rohit Kohli future

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి రాబోయే వన్డే ప్రపంచకప్‌లో చోటు ఉండదనే చర్చ జరుగుతున్న వేళ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ స్పందించాడు. రోహిత్, కోహ్లీ ఛాంపియన్ ఆటగాళ్లని, వారిని తక్కువగా అంచనా వేయకూడదని పేర్కొన్నాడు. వారిని తప్పకుండా ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐకి పాంటింగ్ సూచించాడు (Rohit Sharma, Virat Kohli).


'ఛాంపియన్ ఆటగాళ్లకు ఎప్పుడూ 'కాదు' అని చెప్పకూడదు. వారిని తక్కువగా అంచనా వేయడం సరికాదు. కోహ్లీ తాజా ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. గతంలోలా ఎక్కువగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం లేదు. అయితే అతడిలో పట్టుదల, గెలవాలనే తపన మాత్రం మెండుగా ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ ఎప్పుడూ లేనంత ఫిట్‌గా ఉన్నారు. వీరిద్దరూ తమ కెరీర్‌ను ముందుకు నడిపిస్తూ వన్డే ప్రపంచకప్ ఆడాలని భావిస్తున్నారు. వారికి 'నో' చెప్పకూడదు' అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు (2027 ODI World Cup).


మరోవైపు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ కూడా రోహిత్, కోహ్లీకి మద్దతుగా నిలిచాడు (Rohit Kohli future). పెద్ద టోర్నమెంట్లలో అనుభవం చాలా ముఖ్యమని, అందుకే ఈ ఇద్దరు ఆటగాళ్లు 2027 వరల్డ్‌కప్ వరకు కొనసాగాలని అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌లో కొత్త తరం ఆటగాళ్లు వస్తున్నప్పటికీ, రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సూచించాడు.


ఇవి కూడా చదవండి..

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..


రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 21 , 2026 | 09:27 PM