Share News

టాస్ గెలిచిన చెన్నై జట్టు.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - May 21 , 2026 | 07:32 PM

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ సీఎస్కేకు అత్యంత కీలకం.

టాస్ గెలిచిన చెన్నై జట్టు.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..
CSK vs GT

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ సీఎస్కేకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది (CSK vs GT).


చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ గుజరాత్ కంటే చెన్నైకు అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచి.. ఆర్ఆర్, పంజాబ్, కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అప్పుడే సీఎస్కే జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది (CSK toss update).


తుది జట్లు:

చెన్నై: సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్ చౌదరి, గుర్‌‌జప్నిత్ సింగ్

గుజరాత్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబాడా, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్


ఇవి కూడా చదవండి..

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..


రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 21 , 2026 | 07:32 PM