50 ఓవర్లలో 822 కు 4
ABN , Publish Date - May 13 , 2026 | 01:49 AM
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో 400 స్కోరు దాటితేనే అబ్బురపడుతుంటాం. కానీ జింబాబ్వేలో జరిగిన మాస్వింగో 50 ఓవర్ ఫస్ట్ లీగ్ టోర్నీలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు....
జింబాబ్వే దేశవాళీ జట్టు సంచలనం
హరారే: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో 400 స్కోరు దాటితేనే అబ్బురపడుతుంటాం. కానీ జింబాబ్వేలో జరిగిన మాస్వింగో 50 ఓవర్ ఫస్ట్ లీగ్ టోర్నీలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఓపెనర్లలో ఒకరు ట్రిపుల్ సెంచరీ బాదితే.. మరొకరు 75 బంతుల్లోనే డబుల్ సెంచరీతో చెలరేగాడు. అలాగే ఐదో నెంబర్ బ్యాటర్ శతకంతో మురిపించాడు. ఈ ముగ్గురి విధ్వంసానికి స్కార్పియన్స్ క్రికెట్ క్లబ్ జట్టు 50 ఓవర్లలో ఏకంగా 822/4 స్కోరుతో చరిత్ర సృష్టించింది. తకుండ మడెంబో (143 బంతుల్లో 50 ఫోర్లు, 7 సిక్సర్లతో 302), విన్ఫెడ్ (75 బంతుల్లో 23 ఫోర్లు, 13 సిక్సర్లతో 203), గాబ్రియెల్ (49 బంతుల్లో 22 ఫోర్లతో 110) మోతెక్కించారు. అయితే ప్రత్యర్థి మెథానె లయన్స్ ఛేదనలో 28/7 స్కోరుకే పరిమితమై 794 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 108 ఎక్స్‌ట్రాలు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా