నిన్న పరాగ్.. నేడు చాహల్
ABN , Publish Date - May 08 , 2026 | 02:20 AM
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ వ్యవహారం తాజాగా ఉండగానే.. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా...
ఈ-సిగరెట్ తాగుతూ దొరికిన స్పిన్నర్
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ వ్యవహారం తాజాగా ఉండగానే.. పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా అదేపని చేసి దొరికిపోయాడు. పరాగ్‌కు మించి అన్నట్టుగా చాహల్ ఏకంగా విమానంలోనే సిగరెట్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌కు వచ్చే సమయంలో పేసర్ అర్ష్‌దీప్ సరదాగా మాట్లాడుతూ చేసిన ఆ వీడియోలో చాహల్ తన ఎడమ చేతిని నోటికి అడ్డుపెట్టుకుని కుడి చేతితో పొగ పీల్చుతున్నట్టు కనిపించింది. అయితే ఈ క్లిప్ వైరల్ కావడంతో వెంటనే చాహల్ దృశ్యాన్ని తొలగించి మరో వీడియోను అప్‌లోడ్ చేయడం గమనార్హం. డీజీసీఏ నిబంధనల ప్రకారం ఏరకంగానైనా విమానంలో పొగతాగడం నిషిద్ధం. అలాంటి వారిపై విచారణ లేకుండానే నెల రోజులపాటు విమానం ఎక్కకుండా నిషేధం విధిస్తారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక పదవికి రాజీనామా