సరైన మద్దతు, గౌరవం లేకనే..
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:58 AM
ఆటను ఆస్వాదించలేకపోవడంతో పాటు మద్దతు, గౌరవం లభించకపోవడం వల్లే క్రికెట్‌కు వీడ్కోలు పలికానని భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు....
రిటైర్మెంట్‌పై యువరాజ్
న్యూఢిల్లీ: ఆటను ఆస్వాదించలేకపోవడంతో పాటు మద్దతు, గౌరవం లభించకపోవడం వల్లే క్రికెట్‌కు వీడ్కోలు పలికానని భారత జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో తన పేరు లేకపోవడంతో యువీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ‘నా ఆటను ఆస్వాదించలేకపోయా. నేనే సంతృప్తిగా లేనప్పుడు ఇక క్రికెట్ ఆడి ఏం ప్రయోజనం? అలాగే నాకు సరైన మద్దతు, గౌరవం దక్కడం లేదని తెలిశాక కూడా ఆటలో కొనసాగడం సరికాదనిపించింది. అయినా నేనింకా ఏం నిరూపించుకోవాలి? మానసికంగా, శారీరకంగానూ అంతకుమించి ఆటకు ఎక్కువ ఇవ్వలేనని భావించా’ అని తన రిటైర్మెంట్‌పై ఓ పాడ్‌కా్‌స్టలో యువరాజ్ వివరించాడు.
ఇవి కూడా చదవండి..
సిట్ అధికారులకు లేఖ రాసిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి..
కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..