ధోనీ, కపిల్‌కు క్షమాపణ చెబుతా!
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:14 AM
కెప్టెన్‌గా ధోనీ భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. దీంతో ఆల్‌రౌండర్‌గా క్రేజ్ సంపాదించిన యువరాజ్ సింగ్‌కు సారథ్యం వహించే అవకాశం దక్కలేదు. అయితే...
న్యూఢిల్లీ: కెప్టెన్‌గా ధోనీ భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. దీంతో ఆల్‌రౌండర్‌గా క్రేజ్ సంపాదించిన యువరాజ్ సింగ్‌కు సారథ్యం వహించే అవకాశం దక్కలేదు. అయితే, యువీకి కెప్టెన్సీ చాన్స్ రాకపోవడం వెనుక ధోనీ కుట్ర ఉందని అతడి తండ్రి, మాజీ ఆటగాడు యోగ్‌రాజ్ సింగ్ పలుమార్లు ఆరోపణలు చేశాడు. అసలు యువీ ని భారత జట్టునుంచి తప్పించింది కూడా ధోనీయేనని అన్నాడు. ఈ నేపథ్యంలో ‘ధోనీ, కపిల్‌దేవ్‌లకు తాను క్షమాపణలు చెప్పాలనుకొంటున్నాన’ని ఓ పాడ్‌కాస్ట్ టీజర్‌లో యువీ తెలిపాడు. ఇలాంటి ఆరోపణలు తరచూ చేస్తున్నప్పుడు.. ‘నాన్నా.. ఇది మంచిది కాద’ని వారించానన్నాడు. 1980ల్లో నార్త్‌జోన్ జట్టు నుంచి తనను తప్పించినందుకు.. అప్పటి కెప్టెన్ కపిల్‌దేవ్‌ను చంపేయాలనుకొన్నట్టు యోగ్‌రాజ్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తుపాకీ తీసుకుని తాను కపిల్‌దేవ్ ఇంటికి కూడా వెళ్లానన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు