రిటెన్షన్ జాబితా వచ్చేసింది
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:33 AM
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఐదో సీజన్ వేలం వచ్చేనెల 28న జరుగనుంది. ఇందులో భాగంగా లీగ్‌లోని 5 ఫ్రాంచైజీలు...
అక్టోబరు 28న డబ్ల్యూపీఎల్ వేలం
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఐదో సీజన్ వేలం వచ్చేనెల 28న జరుగనుంది. ఇందులో భాగంగా లీగ్‌లోని 5 ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే క్రీడాకారిణులతోపాటు వదులుకునేవారి జాబితాలను విడుదల చేశాయి. వచ్చే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు డబ్ల్యూపీఎల్ జరుగనుంది. లీగ్ నిబంధనల ప్రకారం ప్రతీ జట్టులో గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లు ఉండవచ్చు. ఇందులో ఆరుగురు విదేశీ క్రికెటర్లకు అనుమతి ఉంటుంది. రిటైన్ చేసుకునే క్రికెటర్ల సంఖ్యపై పరిమితి లేదు. వచ్చే సీజన్ కోసం ప్రస్తుతం గుజరాత్ 15 మందిని.. ముంబై, ఢిల్లీ 13 మంది ప్లేయర్ల చొప్పున రిటైన్ చేసుకున్నాయి. ఇక డిఫెండింగ్ చాంప్ బెంగళూరు 11 మందితో సరిపెట్టుకుంది. డానీ వ్యాట్ (గుజరాత్), గ్రేస్ హారిస్, లిన్సే స్మిత్, హేమలత (ఆర్‌సీబీ), స్నేహ్ రాణా (డీసీ), కమలిని (ముంబై), కిరణ్ నవ్‌గిరె, డాటిన్ (యూపీ)లను ఆయా జట్లు వేలం కోసం అందుబాటులో ఉంచాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..