పాక్‌పై గెలిచి.. తుదిపోరుకు లంక
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:19 AM
మహిళల టీ20 ఆసియాక్‌పలో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక ఫైనల్లో ప్రవేశించింది. దీంతో ఆదివారం జరిగే తుది పోరులో..
రేపు భారత్‌తో ఢీ
దుబాయ్: మహిళల టీ20 ఆసియాక్‌పలో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక ఫైనల్లో ప్రవేశించింది. దీంతో ఆదివారం జరిగే తుది పోరులో భారత జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కఠభరిత రెండో సెమీ్‌సలో లంక 4 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాతిమా సనా (47 నాటౌట్), ఓపెనర్ జుల్ఫికర్ (24) రాణించారు. చాముడి, చమరిలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసిం ది. 33 రన్స్‌కు నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో హర్షిత (36) జట్టును ఆదుకుంది. ఐదో వికెట్‌కు కవిష (33)తో కలిసి 67 పరుగులు జోడించింది. చివర్లో ఉత్కంఠ ఎదురైనా నీలాక్షిక (18 నాటౌట్) విలువైన పరుగులతో మ్యాచ్‌ను ముగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఫాతిమా సనా నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 20 ఓవర్లలో 130/5 (ఫాతిమా 47 నాటౌట్, జుల్ఫికర్ 24; చమరి 2/24, చాముడి 2/25).
శ్రీలంక: 18.4 ఓవర్లలో 134/6 (హర్షిత 36, కవిష 33, ఇమేష 24; ఫాతిమా 4/38).
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం