అప్పటిదాకా ఆగాల్సిందే!
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:07 AM
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో 175 పరుగుల స్కోరుతో విధ్వంసం సృష్టించాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీని...
వైభవ్ జాతీయ అరంగేట్రానికి
అడ్డుగా ఐసీసీ నిబంధనలు
న్యూఢిల్లీ: చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో 175 పరుగుల స్కోరుతో విధ్వంసం సృష్టించాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీని భారత టీ20 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయాలన్న డిమాండ్ ఊపందుకొంది. కానీ, ఐసీసీ నిబంధనలు అందుకు అడ్డొస్తున్నాయి. క్రికెటర్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. 2020లో ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే ఆటగాడి కనీస వయసు 15 ఏళ్లుగా ఉండాలని నిర్ణయించారు. 2011, మార్చి 27న వైభవ్ జన్మించగా.. 2026, ఫిబ్రవరికి అతడి వయసు సాంకేతికంగా 14 సంవత్సరాలే. భారత జట్టుకు ఎంపిక చేయాలంటే అతను ఈ ఏడాది మార్చి 27 వరకు వేచిచూడాలి. మరోవైపు వైభవ్ అండర్-19 కెరీర్ కూడా ముగిసింది. బీసీసీఐ ‘వన్ టైమ్’ పాలసీ కింద సూర్యవంశీ మరో యూత్ వరల్డ్‌కప్‌లో ఆడేందుకు అనర్హుడు.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!