సిరీస్ విండీస్ వశం
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:36 AM
గడచిన 23 ఏళ్లలో శ్రీలంకపై వెస్టిండీస్ తొలిసారి సిరీస్ విజయంతో అదరగొట్టింది. లంకతో రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్ట్‌ల...
లంకతో రెండో టెస్ట్ డ్రా
నార్త్ సౌండ్: గడచిన 23 ఏళ్లలో శ్రీలంకపై వెస్టిండీస్ తొలిసారి సిరీస్ విజయంతో అదరగొట్టింది. లంకతో రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీ్‌సను 1-0తో నెగ్గిన విండీస్.. 11 సిరీ్‌సల తర్వాత తొలి గెలుపు రుచి చూసింది. 2023 తర్వాత కరీబియన్లు టెస్ట్ సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఆటకు ఆఖరి రోజు లంక నిర్దేశించిన 302 పరుగుల ఛేదనలో విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 109 రన్స్ చేసింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌ను లంక 251/9 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 549, విండీస్ 499 రన్స్ చేశాయి. తొలి టెస్ట్‌లో విండీస్ గెలిచింది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ ఎన్నికల్లో పెను సంచలనం.. డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాకు షాక్!
అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు