విండీస్ శుభారంభం
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:50 AM
న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీ్‌సలో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. తొలి వన్డేలో విండీస్ ఏడు వికెట్లతో విజయం సాధించింది...
తొలి వన్డేలో కివీస్ ఓటమి
ప్రావిడెన్స్ (గయాన): న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీ్‌సలో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. తొలి వన్డేలో విండీస్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. మొదట కివీస్ 49.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (65) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. యంగ్ (49), బ్రేస్‌వెల్ (29), నికోల్స్ (27), చాప్‌మన్ (27) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4 వికెట్లతో సత్తా చాటగా, 19 ఏళ్ల అరంగేట్ర స్పిన్నర్ విటెల్ లాస్ 3 వికెట్లతో అదరగొట్టాడు. ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కేసీ కార్టీ (95), కెప్టెన్ షాయ్ హోప్ (87 నాటౌట్) దుమ్ము రేపడంతో విండీస్ 48.5 ఓవర్లలో 268/3 స్కోరు చేసి గెలిచింది.
ఇవి కూడా చదవండి:
నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!
భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!