Share News

కోహ్లీతో వివాదం హెడ్‌ భార్యకు వేధింపులు

ABN , Publish Date - May 26 , 2026 | 02:28 AM

ఐపీఎల్‌లో గతవారం జరిగిన మ్యాచ్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది...

కోహ్లీతో వివాదం హెడ్‌ భార్యకు వేధింపులు

మెల్‌బోర్న్‌: ఐపీఎల్‌లో గతవారం జరిగిన మ్యాచ్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. భారత క్రికెట్‌ అభిమానులు ఆన్‌లైన్‌ వేదికగా తనను తీవ్రంగా వేధిస్తున్నారని హెడ్‌ భార్య జెస్సికా వాపోయింది. ఐపీఎల్‌లో ఆ మ్యాచ్‌ ముగిసిన అనంతరం హెడ్‌తో కరచాలనం చేసేందుకు కోహ్లీ నిరాకరించిన సంగతి తెలిసిందే. ‘ఆ మ్యాచ్‌ ముగిశాక నా సోషల్‌ మీడియా ఖాతాల్లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. నన్నే కాకుండా నా కుటుంబసభ్యులు, స్నేహితులను కూడా వేధిస్తున్నారు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌పై ఆసీస్‌ గెలిచినప్పుడు కూడా ఇలాగే జరిగింది. క్రీడారులకు కూడా కుటుంబాలు ఉంటాయని మర్చిపోరాదు. ఆట ముగిశాక పరస్పరం గౌరవించుకోవాలి. కానీ ఇలా ప్రవర్తించడం సరికాదు’ అని జెస్సికా సూచించింది.

ఇవీ చదవండి:

ఫిఫా ప్రపంచ కప్‌నకు ముందు గాయపడ్డ మెస్సి!

ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!

Updated Date - May 26 , 2026 | 02:28 AM