Share News

కోహ్లీ @: రూ.230 కోట్లు

ABN , Publish Date - May 21 , 2026 | 01:30 AM

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికంగా రూ. 230 కోట్లు ఆర్జించిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఫెనాటిక్‌ స్పోర్ట్స్‌, హరూన్‌ ఇండియా తాజా నివేదిక...

కోహ్లీ @: రూ.230 కోట్లు

ఐపీఎల్‌ ఆర్జనలో విరాట్‌కు అగ్రస్థానం

అత్యధిక విలువైన ఫ్రాంచైజీగా కోల్‌కతా

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికంగా రూ. 230 కోట్లు ఆర్జించిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఫెనాటిక్‌ స్పోర్ట్స్‌, హరూన్‌ ఇండియా తాజా నివేదిక.. ఈ విషయాలను బయటపెట్టింది. లీగ్‌ ఆరంభం నుంచి కోహ్లీ.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రోహిత్‌ శర్మ రూ. 227.2 కోట్లు, చెన్నై తరఫున ఆడుతున్న ధోనీ రూ. 200 కోట్ల ఆర్జనతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, లీగ్‌లోని 10 ఫ్రాంచైజీల విలువ రూ. 1.63 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. వీటిలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విలువ అత్యధికంగా రూ. 19,200 కోట్లు కాగా.. ముంబై, చెన్నైలు రూ. 18,400 కోట్ల చొప్పున రెండో స్థానంలో ఉన్నాయి. మహిళల లీగ్‌లో స్మృతి మంధాన రూ. 13.7 కోట్లతో అత్యధిక ఆర్జన గల ప్లేయర్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి:

భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్

లార్డ్స్‌ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా

Updated Date - May 21 , 2026 | 01:30 AM