ఒక్క నిమిషమూ వృథా చేయొద్దు
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:59 AM
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ సన్నాహకాలను మొదలు పెట్టింది. ఆదివారం ప్రాక్టీ్‌సను...
సహచరులకు కోహ్లీ హితవు
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ సన్నాహకాలను మొదలు పెట్టింది. ఆదివారం ప్రాక్టీ్‌సను ఆరంభించింది. ఈనేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టునుద్దేశించి ఉత్తేజపూరిత ప్రసంగం చేశాడు. టైటిల్ నిలబెట్టుకొనే క్రమంలో ఒక్క క్షణమూ వృథా చేయకూడదని హితవు పలికాడు. ‘గత రెండు మూడు సీజన్ల తీవ్ర కష్టానికి ఫలితం.. గత ఏడాది టైటిల్ రూపంలో దక్కింది. అన్ని జట్లు ఈసారి మనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయి. అందువల్ల ఒక్క రోజును కాదు..ఒక్క క్షణమూ వృథా చేయకూడదు. ఈ రెండున్నర నెలలు 120 శాతం ప్రతిభ కనబరచాలి’ అని విరాట్ సహచరులకు ఉద్బోధించాడు.
ఇవి కూడా చదవండి:
అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..