Share News

రూమర్లకు విరాట్‌ చెక్‌..

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:28 AM

ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో జీవిస్తున్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తనపై వస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టాడు...

రూమర్లకు విరాట్‌ చెక్‌..

న్యూఢిల్లీ: ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో జీవిస్తున్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తనపై వస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టాడు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడేందుకు తను ఇటీవలే భారత్‌కు చేరుకుని జట్టుతో కలిశాడు. అయితే జట్టు ముందు తను పలు డిమాండ్లు ఉంచినట్టు, వీటిలో భారత్‌-లండన్‌ మధ్య ప్రయాణించేందుకు చార్టెడ్‌ విమానం ఏర్పాటు చేయడం.. మ్యాచ్‌ల మధ్య మూడు రోజులకు మించి విరామం వస్తే వెంటనే లండన్‌కు వెళ్లి మరో మ్యాచ్‌కు ముందు రోజే తిరిగి రావడం లాంటివి ఉన్నట్టు సోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వీటినే తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రీపోస్ట్‌ చేసిన విరాట్‌.. వాటికి నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. దీంతో అవన్నీ కల్పిత కథనాలే అని తేలినట్టయ్యింది.

ఇవి కూడా చదవండి:

ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

Updated Date - Mar 23 , 2026 | 06:34 AM