Share News

ప్రతిసారీ నిరూపించుకోవాలా?

ABN , Publish Date - May 16 , 2026 | 02:54 AM

క్రికెట్‌పై అపారమైన ప్రేమ, అంకితభావం కారణంగానే ఇంకా కొనసాగుతున్నానని, తానెవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని...

ప్రతిసారీ నిరూపించుకోవాలా?

  • అలాంటి పరిస్థితి అవసరం లేదు

  • ప్రతీ బంతిని చివరిదిగా భావిస్తా!

న్యూఢిల్లీ: క్రికెట్‌పై అపారమైన ప్రేమ, అంకితభావం కారణంగానే ఇంకా కొనసాగుతున్నానని, తానెవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఐపీఎల్‌లో తన ఫ్రాంచైజీ ఆర్‌సీబీ పాడ్‌కా్‌స్టలో విరాట్‌ పలు అంశాలపై మాట్లాడాడు. ‘నా దృక్పథం స్పష్టంగా ఉంది. నా అవసరం జట్టుకు ఉందంటేనే ఆడతాను. నిజానికి కష్టపడే విషయంలో నేనెవరికీ తక్కువ కాదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా నేను సన్నద్ధమవుతా. ఎదుర్కొనే ప్రతీ బంతిని చివరిదిగా భావించి ఆడతాను. ఇంత చేసినా జట్టులో నా స్థానం కోసం నిరూపించుకోవాల్సిన అవసరం వస్తే మాత్రం అలాంటి వాతావరణంలో ఉండలేను. ఇక 2027 వన్డే వరల్డ్‌క్‌పలో ఆడాలనుకుంటున్నావా? అని చాలా మంది అడుగుతుంటారు. ఎందుకు ఆడను? కానీ నేను ముందే చెప్పినట్టుగా ఆ విలువ అనేది ఇరువైపులా ఉండాలి’ అని విరాట్‌ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 16 , 2026 | 02:54 AM